Vyāsa-pūjā 2019
నమ ఓం విష్ణు పాదయా కృష్ణ ప్రేస్తాయా భూతాలే
శ్రీమతే జయపతాక స్వామిన్ ఇతి నామినే
నమో ఆచార్య పాదయా నితాయి కృప ప్రదాయినే
గౌర కాత ధామ దాయ నగర గ్రామ తారీనే
శ్రీల గురుమహరాజ్ పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కీర్తిస్తున్నాను
ముందుగా ఈ భౌతిక ప్రపంచ బంధనాల నుండి బయట పడవేసి ఆ దేవదేవుని శ్రీ కృష్ణని పాద పద్మాలను ఆశ్రయనించేటట్లు చేసి ఈ మానవ జీవిత లక్ష్యాన్నిచేరుకొనేటట్లుగా చేసిన శ్రీల గురుమహారాజేయొక్క మేలు మరిచిపోలేనిది. మరియు ఈ మిషన్లలో నేను కూడా ఒక్క చిన్న పరికరంగా ఉన్నందుకుగర్విసుతున్నాను. ఈ భౌతిక ప్రపంచ దావానలం ఉంది మరింత మంది జీవాత్మలను రక్షిస్తున్న శ్రీల గురుమహారాజుకు నా అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకొంటున్నాను.
నిజంగా చెప్పాలంటే శ్రీల గురుమహారాజును కీర్తించేయందుకు నాకు ఎలాంటి అర్హత లేదు నాలాంటి ఒక్క పాపి జీవాత్మను తన శిస్యురాలిగా స్వీకరించినందుకుఅది నా అద్రష్టుంగా భావిస్తున్నాను.
శ్రీల గురుమహారాజాల జీవితంలో ప్రతి ఒక్క సంఘటన ఎంతో మందికీ ఉత్చాహంన్నిచ్చి ఆధ్యాత్మికంగా ఉన్తతంగా ఎదగడానికీ ఒక్క ప్రేరణగా ఉన్నది.ఆయనకు అయినా గురుగారిపట్ల ఉన్న భక్తి గౌరవం ఎనలేనిది. ఎంత కఠినమయిన పరిస్థితులు ఆరోగ్యపరంగాకాని లేక ఇతరమైనవికాని ఎదురైనప్పటికీ వాటినిశిఖరంలాగా ఎదుర్కొని అనంతంగా ప్రపంచవ్యాప్తంగా అయన చేస్తున్న ప్రచారం ఎనలేనిది. ఆయన యొక్క కరుణాకటాక్షం మా కుటుంబంలో అందరుసబ్యులకు దొరకాలని మరెంతమంది బద్ద జీవాత్మలు ఆయన ఆశ్రయాన్ని పొంది ముక్తజీవాత్మలుగా కావాలని కోరుకొంటున్నాను .
దేవాదిసేవుడైన శ్రీ కృష్ణడు శ్రీమతి రాధారాణి మరియు శ్రీల ప్రభుపాదలు ఆయనకు ఇంకా ఇంకా మంచి ఆరోగ్యాని ఆయుషిను శక్తిని ప్రసాదించి ఆయినా తొరగాలేచి నడవాలని ఇంకా ఆయినా శ్రీల గురుదేవులయొక్క ఆశయాల్ని నెరవేర్చాలని కోరుకొంటూ నిరంతరం నిరాటంకంగా ఈ మిషనలు భాగాన్నిగా ఆయీ నావంతుభాజ్యతఃను నేరవేర్చాలని కోరుకొంటూ దానికి శ్రీల గురుమహారాజైన ఆశీర్వాదని కోరుకొంటూ
మీ పాదపద్మాల దాసానుదాసి
శ్రరణాగత యశోద దేవి దాసీ