ఓం విష్ణు పాదయా కృష్ణ ప్రష్టాయ భూతలే
శ్రీమతే జయపతాక స్వామిన్ ఇతి నామినే
నమ ఆచార్య పాదయా నితాయి కృప పదాయినే
గౌర కాంత దామ దాయ నగర గ్రామా తారీనే.
శ్రీల గురుదేవుల పాదపద్మాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
మిమ్మల్ని కీర్తించడానికి నాకు ఎలాంటి అర్హత లేదు, అయినా మీకు గల అనంతమైన కరుణ చే నమ నన్ను మీ శిష్యురాలిగా స్వీకరించినందుకు అది న అదృష్టం గ భావిస్తున్నాను . ఈ భౌతిక ప్రపంచంలోని జనన మరణ చక్రం లో నుండి బయట పడేందుకు ఒక అవకాశం ఇచ్చినందుకు న హృదయ పూర్వక కృతజ్ఞతలు.
గురు దేవా మీరు 2019 లో పేస్ బుక్ లో క్లాస్ చెబుతున్నపుడు మీరు మీకు వచ్చిన స్వప్నం గురించి వివరించారు,మీరు రాధా మాధవ్ ముందు నృత్యం చేస్తున్నట్టుగా పూర్తి ఆరోగ్య్యవంతుడిగా వున్నట్టుగా... ఆ కల నిజమయ్యే సమయం కోసం వేచి చూస్తున్నాను.
మీరు ఎలా వున్నా మీకు ఎలాంటి తేడా లేదు కానీ మీరు పూర్తి ఆరోగ్యంగ ఉంటే నాలాంటి పతిత జీవులెందరికో భగవద్దామనికి తిరిగి వెళ్లే మార్గం చూపుతారు కాబట్టి మీకోసం కాకపోయిన మాకోసం మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ జగన్నాథుణ్ణి వేడుకుంటున్నాను.
నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి .
భక్తి పూర్వక హృదయంతో మీ శిష్యురాలు
సువర్ణ జాహ్నవి దేవి దాసి.
కృష్ణ ఖతార్ దేశ్