నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతాలే
శ్రీమతే జయపతాక స్వామి ఇతి నమినే,
నామ ఆచార్య పాదాయ నితై కృపా ప్రదాయినే
గౌర కథా ధామ దయా నగర గ్రామ తారిణే ॥
నామ ఓం విష్ణు-పాదాయ కృష్ణ-ప్రేష్ఠాయ భూ-తలే
శ్రీమతే భక్తివేదాంత-స్వామిన్ ఇతి నామిన
నమస్ తే సరస్వతే దేవే గౌర-వాణి-ప్రచారిణే
నిర్విశేష-శూన్యవాది-పశ్చత్య-దేశ-తారిణే ॥
పూజ్యలైన గురువు గారికి మీ ప్రియదాసి K శాంతమ్మ from New Rajpur Jaganath Dam, Bangalore.
గురువును మించిన దైవముందా భక్తిని మించిన లోకమున్నదా. ఏ కార్యము చేసిన గురువులంగీకారంముతో మొదలు పెట్టిన ఆ కార్యము విజయవంతమే. గురువుని పాద పద్మములకు శుద్ధతో శరణు కోరుతు ఆ పాద పద్మములకు సావధానముతో వందనములు చేయుదును
గురు దేవుని ముఖం పద్మ వ్యాఖ్యలను నా హృదయములో ఒకటిగా చేసుకుని మరేమి ఆశించక గురు దేవుని చరణముల పట్ల అనురక్తి ఆధ్యాత్మిక పురోభి వృద్ధికి సర్వోత్తమము
గురుదేవులే నాకు జన్మ జన్మలకు ప్రభువు అతని కృప ద్వారానే హృదయమున దివ్యజ్ఞానము వెల్లడవుతుంది.
ఓ గురుదేవా నీవు కరుణాసాగరుడవు జనులకు ఆప్తుడవు మరియు అందరికీ ఉపదేశకుడవు,సర్వజనులలో జీవము నీవు. ఓ గురుదేవా దయచేసి మాపై కృప చూపి నీ పాద పద్మముల యొక్క నీడను మా పై ప్రసాదించుము. ఓ గురుదేవా మీ కీర్తి ముల్లోకాలు విస్తరించుగాక గురుదేవుని కృపతోనే ఈ భవసాగరాన్ని దాటి శ్రీకృష్ణ భగవానుని పొందగలము.భగవానుని సేవలో భక్తి ముక్తి సాధించాలని భక్తి సేవలో ఇంకా ముందుకు వెళ్లాలని శ్రీల గురుదేవుఘ పాదపద్మములకు నమస్కరించుతున్నాను.
ఇట్లు తమ ప్రియ దాసి
K santhamma మరియు కుటుంబ సభ్యులు
Rudresh
Ganesh Kumar
Nagashree
Dhanvith
Gopīnātha