ప్రియమైన గురు మహారాజ్ ఈ దాసుని యొక్క వినమ్ర పూర్వక దండ ప్రణామములు స్వీకరించండి
మీ వ్యాస పూజా సందర్బంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటు న్నాను, B G 4-34,35,36 శ్లోకాలు ఎలా అమలు పరచవచో మిమ్మల్ని చూసి నేర్చుకోచ్చు, ఆధ్యాత్మిక ఆచార్యున్ని ఆశ్రయించుట, పరి ప్రశ్ననా, సేవయా, సర్వ జీవుల పట్ల దయ, దుఃఖల నుండి విముక్తి అనునవి మీలో మేము దర్శిస్తున్నాము, శ్రీమద్బగవతం లో వివిధ భక్తుల వర్ణనలు ఉన్నట్లుగా, మీ ఆధ్యాత్మిక ఆచార్యులు అయిన శ్రీల ప్రభుపదుల వారి ఆశయాలు నేర్వచుతున్నారు, శ్రీలక్ష్మి రూపాగోస్వామి భక్తిరాసమృతం లో వివరించారు అవ్యభిచారేనా అన్యభిలసీతాసూన్యం జ్ఞాన కర్మది అన్నావృతం అనుకులేనా కృష్ణానుశీలనం భక్తిరుత్తమ, ఇందులో అనుశీలనం అనగా కృష్ణునికి లేదా కృష్ణ భక్తునికి సేవ చేయ్యడం, అది మీనుండి మేము అలవార్చుకోవలసిన అతిముఖ్య అంశం.
శ్రీ చైతన్య మహా ప్రభు తన నామం గ్రామ గ్రామానికి విస్తరిస్తుంది అని చెప్పగా శ్రీల ప్రభుపాద ప్రాపంచ వ్యాప్తంగా విస్తరించగ మీరు గ్రామ గ్రామం నకు చేరు చేస్తున్నారు , మీ అధ్యాత్మిక ఆచార్యులు మీ మీద ఉంచిన భాద్యత లు నెరవేర్చుటలో మీ శరీరం అలసట చెండుటలేదు భీస్మ దేవా అమషాయ్యమీద భాద అనుభవించినను చివరి సమయం లో దేవదేవుని దివ్య దర్శనం చేత చందనం చేత వేసవితాపం సమించినట్లు ఆయన భాద సమించింది , అలాగే మీ శరీరం అనేక భాదలకు గురి అయినాను సేవ అనే చందన పరిమళం చేత అవన్నీ సమసి పోవుచున్నవి.
కావున మీ దివ్య ఆశీషులచే మేము ఈ భక్తి యుత సేవమార్గం లో అభివృద్ధి చెందుతూ మీకు, శ్రీల ప్రభుపాడులవారికి, శ్రీకృష్ణ భగవానుల వారికి సేవ చేసుకునే శక్తి ని ప్రసాదిచవలిసిందిగా వేడుకుంటున్నాను.
మీ సేవకుడు
వ్రజ రాజ మురారీ దాస