హరే కృష్ణ గురు మహరాజ్.
గురు మహారాజ మేము ఈ కృష్ణ భక్తిలో ఉన్నామంటే దానికి మీ యొక్క అపారమైన కృప కారణం. మొదట జపం తో మొదలు పెట్టి అంచల అంచలుగా నాలుగు నియమాలు పాటిస్తూ భగవద్గీత భాగవతం రోజు చదువుకుంటున్నాము. మీ కృప వల్ల నేను భక్తి శాస్త్రి పూర్తి చేసి మరియు idc కూడా పూర్తి చేసి certicate కూడా అందుకున్నాను. ఈ సంవత్సరం మీ పుణ్యంతో vrundavanam మాయాపూర్ దర్శించుకున్నాము. మా అమ్మాయికి కూడా మీ కరుణ చూపించి అలా కృష్ణ చామలను దర్శించుకొని కృష్ణ భక్తి కి రావాలని వేడుకుంటున్నాను. మీ కరుణ వల్ల కృష్ణ కరుణ వల్ల మా అబ్బాయికి జాబ్ దొరికింది. మా అమ్మాయి కూడా mbbs ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసుకోవాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దర్ని కృష్ణ చైతన్యం లోకి రావాలని కృష్ణ భక్తిని ప్రచారం చేయాలని ఆశీర్వదించండి. ఇంకా నేను న భర్త ఇద్దరము మీ దగ్గర దీక్ష కోసం ఎదురుచూస్తూ వున్నాము మీ కృపను కరుణించి మాకు దీక్షను ఇవ్వండి గురు మహారాజ. మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే భక్తుల సాంగత్యములో ఉండేలాగా చేయండి. మా గురువులు చెప్పిన జ్ఞానమును ఇతరులకు పంచాలని మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు ఇంకా ఇలాంటి జన్మ దినాలు ఎన్నో జరుపుకుంటు మా లాంటి పతిత జీవులను ఎందరినో ఉద్దరించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మీకు ఆయుర్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ నరసింహ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబములోని అందరమూ కృష్ణ భక్తి లో వుంటూ జీవితాంతము మీకు సేవ చేసుకునేల ఆశీర్వదించండి.
మీ సేవకురాలు
అళివేలు శ్రీనివాస రావు