జై గురు, జై గౌరాంగ!
జై శ్రీల ప్రభుపాద!
జై శ్రీల గురుదేవ!
హరే కృష్ణ గౌరమారాజ్, మీ పాదాలకు నా శతకోటి ప్రణామాలు గురు మహారాజ్. మీరు ఎంతో కరుణామయుడు, ఎంతో దయామయుడు. నాలాంటి ప్రతి జీవులందరినీ ఉద్ధరిస్తున్నారు. మీ కరుణ వల్లనే మేము కృష్ణ చైతన్యంలో ఉన్నాము. మీ కరుణ వల్లనే మేము మా ఇంట్లో రాధా దామోదర్‌కి సేవ చేస్తున్నాము.
మీ కరుణ కారణంగా, నేను మా ప్రభుజీ ద్వారా ఆన్‌లైన్‌లో హరినామ దీక్ష తీసుకున్నాము. ఇంకా భక్తిలో సాధన చేసుకోవడానికి మీ దీవెనలు కావాలి.
మీ ఆరోగ్యం కూడా బాగుండాలని, మీ కోసం నరసింహదేవ భగవానుని, రాధా దామోదరుని ప్రార్థిస్తున్నాను.
హ్యాపీ వ్యాసపూజ గురు మహారాజ్!
ఇట్లు,
మీ శిష్యురాలు
హేమకాంతి గోపేశ్వరి దేవి దాసి