Check to restrict your search with:
Menu

Vyāsa-pūjā 2021

Suvarṇa Jāhnavā devī dāsī (Kṛṣṇa Kathā Deśa - Middle East)

శ్రీల గురుదేవులకు జయము జయము

 

శ్రీల ప్రభుపాదులకు జయము జయము

 

                 ప్రియమైన గురుదేవ ఈసంవత్సరంలో ఎన్నో విషయాల్లో ప్రపంచం అంత ఒడిడుకులు ఎదుర్కొంది, కానీ మీరు భక్తిని ప్రచారంలో చేయడంలో సమయానుకూలంగ స్పందిస్తూ ప్రతి ప్రశ్నకు భగవత్సేవయే సరైన సమాధానమని నిరూపిస్తూ మాకందరికి మరింత దగ్గరయ్యారు. మీరు ప్రతి ప్రతిరోజు చైతన్యలీలా ప్రవచిస్తూ మాకు ప్రతిరోజూ మిమ్మల్ని దర్శించే భాగ్యమే కాక మీ ఆశీర్వాదాలు ప్రతేక్ష్యంగ అందిస్తూ మమ్మల్ని భక్తి జీవితంలో మరింత ముందుకు తీసుకెలుతున్నారు. ఇదంతా మీరు నాపై చూపిస్తున్న దయ.

                

                  గురుదేవ నాకు జపం పైన మరింత రుచి,ఆసక్తి పెరగాలని, మీకు నేను చేసిన ప్రమాణాలను శ్రద్ధ భక్తులతో పాటించాలని ఆశీర్వదించండి. నేను ఎప్పుడు సాధన సరిగా చేయట్లేదని బాధపడిన, వేరే ఏ ఇతర భాదాకలిగిన మీనుండి నాకు ఎదో ఒక రూపంలో ప్రతిస్పందన వస్తుంది. వెంటనే అన్ని మర్చిపోయి శ్రీల గుదేవులకు జయము జయము, ప్రభుపాదులకు జయము జయము, జగన్నాథ స్వామికి జయము జయము అని ఆనందంలో మునిగిపోతాను. ఇదంతా మీరు నాపట్ల చూపిస్తున్న వాత్సల్యం. మీరు చూపించే దయ, వాత్సల్యాలే నాకు సంజీవని వంటిది.

 

                 గురుదేవ నేను తెలిసో తెలియకో చేసిన అపరాధలను, తప్పులని క్షమించండి. నేను అపరదాలు చేయకుండా నాకు సరైన బుద్దిని ప్రసాదించండి. ఎల్లప్పుడు నాగురుదేవులైన మిమ్మల్ని, గౌరంగని మరియు వైష్ణవులను సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి.

 

 

మీ శిష్యురాలు

సువర్ణ జాహ్నవ దేవి దాసి.

GODRUMADWIP CAKRA

KKD YATRA