Check to restrict your search with:
Menu

Vyāsa-pūjā 2023

మునిపాలక కృష్ణ దాస్ (Munipālaka Kṛṣṇa Dāsa) (Andhra Pradesh (all) - India)

ప్రియమైన గురు మహారాజా,

 

దయచేసి అర్హత లేని మరియు అప్రధానమైన సేవకుని మీ పాదపద్మములకు హృదయపూర్వక ప్రణామాలను అంగీకరించండి. శ్రీ కృష్ణ చైతన్య మరియు శ్రీల ప్రభుపాదుల సందేశాన్ని పంచడానికి ప్రపంచమంతటా పర్యటించిన మీ దివ్య పాదపద్మములకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీల ప్రభుపాద మరియు శ్రీ శ్రీ నీతై గౌరంగకు అన్ని మహిమలు. మీ మంగళకరమైన దర్శనానికి అన్ని మహిమలు.

 

ఈ పవిత్రమైన రోజుననేను మీ మహిమల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆరోగ్య పరంగా అనేక అసమానతలు ఉన్నప్పటికీమీరు నిరంతరం ప్రయాణాలు చేస్తూపవిత్ర నామం మరియు గౌర లీలలను పంచుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారుఎలాగైతే శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందుతన లీలలకు సహాయం చేయడానికి తన సహచరులందరూ ఈ భూమిపై అవతరించారోఅలాగే శ్రీల ప్రభుపాదుల వారికి తన మిషన్‌లో సహాయం చేయడానికి విదేశాలలో అవతరించిన చైతన్య భగవానుడి సహచరులలో మీరు ఒకరని నేను గట్టిగా నమ్ముతున్నాను . మీ లీలలను చదువుతున్నప్పుడుప్రతి క్షణం నేను మీ మృదువైన హృదయాన్ని మరియు మీరు మా పట్ల చూపిన దయను అనుభవించాను. నా పై మీ దయగల చూపు కోసం నిరంతరం ప్రార్థిస్తున్నాను. దయతో మీరు, నాకు మరియు నా ధర్మపత్నికి  హరినామ దీక్షను ప్రసాదించిమమల్నిగౌడీయ వైష్ణవ పరంపరకు చేర్చిమాకు ఆశ్రయం కల్పించారు. నా క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మీ సహాయం కోసం నేను చాలా సార్లు ప్రార్థించినట్లు నాకు గుర్తుంది. ఈ సంవత్సరం నాకు ఇంకా ప్రత్యేకంశ్రీకృష్ణుడు మా దంపతులకు మగబిడ్డను ప్రసాదించాడుపిల్లల పెంపకంపై మీ సూచనలను నేను నిరంతరం గుర్తుంచుకుంటాను. ఈ అబ్బాయి శ్రీల ప్రభుపాదుల వారి సేవలో ఎల్లప్పుడూ నియుక్తం అయ్యేలా ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను.

 

గురు మహారాజా, ఈ పతనమైన బద్దాత్మ పై మీ నిరంతర కరుణకు నేను కృతజ్ఞుడను. ప్రేమ యొక్క వ్యక్తీకరణ సేవ రూపంలో వ్యక్తమవుతుంది. మీ ప్రేమకృతజ్ఞతనిబద్ధత మరియు శ్రీల ప్రభుపాదుల వారికి సేవ చేయాలనే సంకల్పం ఎల్లప్పుడూ భక్తిలో గంభీరంగా ఉండేలా నన్ను ప్రేరేపిస్తాయి. ఈ పవిత్రమైన రోజునగురు మహారాజా, దయచేసి మీ పాద పద్మాలకు నా అపరాధాలను క్షమించివినయంగా ఉండేలా నన్ను ఆశీర్వదించండి. గురు మహారాజాఇటీవలి రోజుల్లోనేను “మిల్వాకీ నుండి మాయాపూర్ వరకు” చదువుతున్నానుఇది మీ సేవకు మరింత అంకితం కావడానికి నాకు చాలా ప్రేరణ మరియు జ్ఞానోదయాన్ని ఇస్తోంది. దయచేసి నన్నుమీ పాదపద్మములకు మరింత సేవ చేసుకోవటం కోరకు నన్ను అనుమతించి ఆశీర్వదించండి. మీ సూచనలు తూచ తప్పకుండా ఎల్లప్పుడూ అనుసరించేలా ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించండినాపై మీ దయగల ఆశీర్వాదాలకు నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడను.

 

మీ సేవకుడు,
మునిపాలక కృష్ణ దాస్ (దీక్ష)
ఇస్కాన్ ప్రొద్దుటూరు (ఆంధ్రప్రదేశ్)