గౌరవనీయులయిన గురుమహరాజ్ గారికి,
మీరు ఎంతో కరుణామయులు,మీరు ప్రతీ జీవి మీద ఎంతో
ప్రేమను చూపిస్తారు.మీ కరుణ వలన ఎంతో మంది బద్ధజీవులని భౌతిక జీవితం నుండి బయటపడి,ఎంతో ఆనందమయిన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. నేను ఆ కరుణకు పాత్రురాలయినందుకు ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను.అయినా కూడా నేను పూర్తిగా ప్రయత్నం చెయ్యలేకపోతున్నాను.మీ కృప వలన,కృష్ణుని కృప వలన నాకు కృష్ణ చైతన్యం లో ఎటువంటి అడ్డంకులు లేవు.అయినా కూడా న యొక్క బద్ధకం వలన నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను.నాకు తెలుసు ఇది సరి అయినది కాదని.కానీ నేను వెనకబడి పోతున్నాను. నా శిక్షా గురువులు,నా తోటి భక్తులు,నా భర్త సహాయంతో భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను.మీరు నాకు ఆశీస్సులు ఇవ్వండి నా బద్దకాన్ని వదిలి కృష్ణుడి మీద ప్రేమ కలిగి శ్రద్దగా సేవ చేసుకునే మంచి బుద్ధిని ఇవ్వాలని వేడుకుంటున్నాను.
గురుమహరాజ్ మీరు మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా మీ గురువుకి ఇచ్చిన మాట కోసం ఎంతో కట్టుబడి ఉన్నారు.మీరు మీ శిస్యులతో ఎప్పుడు అందుబాటు లో ఉండటానికి ప్రయత్నిస్తారు.ఈ కరోనా సమయం లో మీరు మీ శిస్యులందరికి ఎంతో దగ్గరయ్యారు ఆ సమయాన్ని కృష్ణ కథలతో అందరిలో చైతన్యాన్ని కలిగించారు.మీరు ఏ ప్రపంచానికే గొప్ప ఆదర్శం.మీ ఆరోగ్యాన్ని ఆ నరసింహ భగవానుడు ఎల్లప్పుడూ కాపాడాలని తద్ద్వారా నాలాంటి ఎంతో మంది భౌతిక జీవితం నుండి బయట పడగలరని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
మీ దాసాను దాసాను దాసి
భగవతి వ్రజలక్ష్మీ దేవి దాసి