ప్రియమైన గురు మహారాజ,దయచేసి మీ పాద పద్మముల వద్ద నా ప్రణామాలను స్వీకరించండి.
అత్యంత శుభప్రదమైన మీ ఆవిర్భావ తిథి కి జయము,జయము!!
గురు మహారాజ,
ఈరోజున గౌరాంగ మహాప్రభూ మా అందరినీ ఉద్ధరించడానికి ఆయన కరుణా విస్తరణ అయిన శ్రీల ప్రభూపాదుల వారిని సేవించడానికి మిమ్మల్ని ఇక్కడకు పంపించారు.మేము స్వయంగా, గౌరాంగా,నిత్యానంద దయను చూడకపోయినా ,మీ కరుణ,క్షమా హృదయాన్ని చూసినప్పుడు నితాయి - గౌరాంగ పట్ల మరింత విశ్వాసాన్ని ఇస్తున్నాయి.మీరు ప్రవచనం చెప్పేటప్పుడు నిత్యానంద!!గౌరాంగా!! అని చెప్పినప్పుడు నిజంగా నాకు వారితో శాశ్వత సంబందం ఉంది అనే అవగాహన వస్తుంది.
నిత్యానంద!!గౌరాంగా!! నిత్యానంద!!గౌరాంగా!! అని మీరు కీర్తించినప్పుడల్లా ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గర ఉన్న అనుభూతి కలుగుతుంది.మళ్ళీ మళ్ళీ మీ ముఖతా నిత్యానంద!!గౌరాంగా!! మహిమలు వినాలి అనిపిస్తుంది. ఆ లీలను స్వయంగా మీరు చూస్తూ వర్ణిస్తున్నట్టు మీ ప్రవచనాలు ఉంటాయి.మిమ్మల్ని చూసిన ప్రతీ ఒక్కరికీ నీతాయి - గౌర పట్ల విశ్వాసం కలుగుతుంది.అది మా గురు దేవుడి యొక్క కీర్తి.మాధవ మాసం సందేశంలో మీరు ఎవరైతే మాయా ప్రభావం వలన 16 మాలలు జపం చేయరో,4 నియమాలు పాటించరో వారిని క్షమించమని నితాయి - గౌర లను ,కృష్ణుడికి ప్రార్థిస్తాను అని చెప్పారు.అది చదవగానే ఇంతటి క్షమా గుణం ,కరుణ కేవలం గురు దేవుడికే సాధ్యం అవుతుంది అని నా హృదయం వినయంగా ద్రవించింది.మీ కరుణ నుండి తప్పించుకోడానికి బద్దజీవుడికి అంత సులభమైన విషయం కాదు.ఇంకా,ఇంకా సులభంగా ,ఉచితంగా మీరు అత్యంత విలువైన గౌర నితాయిల ప్రేమను మీరు అందిస్తారు.మీ ఆలోచనలు, సేవలు ,ఉపాయాల వలన ఇస్కాన్ ఎంతో వృద్ధి చెందినా మా అందరి ఆలోచనలు భక్తిని ప్రచారం చేయడానికి తెలియజేయండి అని మీరు అడిగినప్పుడు మీరు గురువు స్థాయిలో ఉన్నా ఎంత వినయంగా ఉన్నారు అనిపించింది.
శ్రీల ప్రభూపాదుల సేవ కోసమే మీరు ఈ భూగ్రహం పైన ఎన్నో అవాంతరాలను ఎదుర్కుంటున్నారు!అది చాలా స్ఫూర్తిని ఇస్తుంది.దయచేసి నేను అనర్థాలను విస్మరించి,శుద్ధ భక్తి సాధన మరియు శ్రద్ధగా హరినామ జపం చేయాలి అని నన్ను ఆశీర్వదించండి గురు మహారాజ!!
మీ సేవకురాలు,
జగత్తారిణి విశాఖ దేవి దాసి.